చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కె.ఎస్.రామారావు, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.
కథాపరంగా ఈ సినిమాకి ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడం వలన, దాదాపుగా ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.