హైదరాబాద్ : పండగ ఆఫర్‌లో భాగం గా పర్సనల్‌ వాయిస్‌, డేటా హాట్‌స్పాట్‌ డివైజ్‌ ‘జియోఫై’ని 999 రూపాయలకే అందిస్తున్నట్టు రిలయన్స్‌ రిటైల్‌ బుధవారంనాడు ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఈ నెల 20వ తేదీన ప్రారంభంకాగా 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఇంతకు ముందు జియోఫై ధర 1,999 రూపాయలుండేది. జియోఫైని కొనుగోలు చేయడం ద్వారా 2జి/3జి మొబైల్‌ ఫోన్లను వినియోగించే కస్టమర్లు కూడా జియో ఆఫర్‌ చేస్తున్న అపరిమిత వాయి స్‌, డేటా ప్రయోజనాలను పొందడానికి అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ డివైజ్‌ను అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లు, జియో ఔట్‌లెట్లు, జియో పార్ట్‌నర్‌ రిటైలర్లు, జియో డాట్‌ కామ్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని పేర్కొంది.