కోలీవుడ్ యువ సినీ దర్శకుడు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. థ్రిల్లర్ మూవీ ధాయంను డైరెక్ట్ చేసిన కన్నన్ రంగస్వామి ఇటీవల హార్ట్‌ అటాక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని వడపళణిలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ధాయం మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌, రంగస్వామికి క్లోజ్ ఫ్రెండ్ అయిన సతీష్ సెల్వం మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో రంగస్వామికి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని.. అది ఆయనకు ఫస్ట్ అటాక్ అన్నారు. 40రోజులుగా రంగస్వామి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కోలీవుడ్ సినీ ప్రముఖులు రంగస్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.