కన్నబిడ్డకు ఏమైనా అయితే తల్లిపేగు తల్లడిల్లుతుంది. బిడ్డ కోలుకునేవరకు ఆ తల్లి రెప్పవాలదు. మరి ఈ మాతృబంధం కేవలం మనుషులకేనా.. కానే కాదు.. మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా ఆఖరికి క్రూరమృగాలైనా తల్లి ప్రేమ మాత్రం ఒకటే. అందుకు నిదర్శనమే ఈ ఘటన. గాయంతో విలవిలలాడుతున్న లేగ దూడను చూసి ఓ తల్లి గోవు గుండె బద్దలైంది. చికిత్స కోసం దూడను ఆసుపత్రికి తీసుకెళ్తుంటే.. తన బిడ్డకు ఏమైందోనన్న ఆరాటం ఆ గోవును దూడ వెంట పరిగెత్తించింది. మాతృప్రేమను కళ్లకు కట్టిన ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.