నానికి వరుస సినిమాలతో పాటు వరుస విజయాలు వచ్చిపడుతున్నాయి. దాంతో ఆయన మంచి కాంబినేషన్స్ ను సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ .. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలతో నాని ఫుల్ బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి మహేశ్ బాబు సోదరి మంజుల నిర్మాతగా వ్యవహరించనుంది.ప్రస్తుతం మంజుల తన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ఒక సినిమాను రూపొందిస్తోంది. ఆ సినిమాకి సంబంధించిన పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఆ పనులు పూర్తి కాగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. వాస్తవానికి ఈ ప్లేస్ లో నాని ..హను రాఘవపూడితో సినిమా చేయాల్సి వుంది. కానీ ఆ ప్రాజెక్టు వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది.