నేడు దసరా రేసుకు క్లైమాక్స్ గా విడుదలైన ‘మహానుభావుడు’ ఓవర్సీస్ టాక్ బయటకు వచ్చింది. నిన్న రాత్రి అమెరికాలో ఈసినిమా ప్రీమియర్ షోలను చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఈసినిమా పై ఇచ్చిన కామెంట్స్ అత్యంత ఆసక్తి దాయకంగా మారాయి.దర్శకుడు మారుతి నేటితరం ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా ఈసినిమాను తీసాడని ఓవర్సీస్ ప్రేక్షకులు తీర్పు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అతి శుభ్రత (ఓసీడీ) అనే వ్యాధితో సతమతమయ్యే హీరో పాత్రలో శర్వానంద్ నటనకు ఓవర్సీస్ ప్రేక్షకులు మంచి మార్కులు వేసినట్లు తెలుస్తోంది.దీనికితోడు వెన్నెల కిషోర్ శర్వానంద్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ను ఓవర్సీస్ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసినట్లు టాక్. హీరో శర్వానంద్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం అయిన ఈసినిమాలో తన ప్రేమకథను ప్రేక్షకులకు చెపుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి శర్వానంద్ ప్రేక్షకులను తీసుకు వెళ్ళినట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈమూవీలోని పాటల చిత్రీకరణ చాల ఆహ్లాదకరంగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ తండ్రిగా నాజర్ ఎంట్రీతో ఈ సినిమాకు ఊహించని కొత్త మలుపును మారుతి ఇచ్చినట్లు తెలుస్తోంది. శర్వానంద్, మెహ్రీన్ మధ్య పలు హాస్య సన్నివేశాలు ఈసినిమాను చూస్తున్న వారికి ఆనందాన్ని కలిగిస్తాయి.ముఖ్యంగా శర్వానంద్ అతడి తల్లికి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయని అంటున్నారు. ఇక క్లైమాక్స్ విషయంలో ముందుగా ఈమూవీలో ఒక భారీ కుస్తీ పోటీ పెట్టి మారుతి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుతున్న ప్రాధమిక సమాచారం బట్టి ‘మహానుభావుడు’ సినిమాకు పాజిటివ్ టాక్ ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి వచ్చినట్లు తెలుస్తోంది. దీనితో అందరు ఊహించినట్లుగానే శర్వానంద్ దసరా రేసు విజేతగా నిలిచాడు అంటూ ప్రాధమిక వార్తలు అందుతున్నాయి..