మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి శ్రీను తన సినిమా కథలను రెడీ చేసుకుంటూ ఉంటాడు. ఆయన సినిమాల్లో హీరోతో సమానమైన శక్తిసామర్థ్యాలు కలిగినవాడిగా విలన్ పాత్రను మలుస్తూ ఉంటాడు. బలమైన విలన్ ను ఎదుర్కొన్నప్పుడే అసలైన హీరోయిజం బయటపడుతుందనీ .. అప్పుడే అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆయన భావిస్తుంటాడు.ఇదే పద్ధతిని ఆయన చరణ్ సినిమా విషయంలోను పాటిస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఆయన పాత్రను బోయపాటి చాలా క్రూరంగా మలిచాడనే టాక్ వినిపిస్తోంది. ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆయన ఎంతటి క్రూరుడు అనే విషయం చెప్పడానికి గాను, 25 మందిని కారుతో తొక్కించే సీన్ ఉంటుందని చెబుతున్నారు. చరణ్ .. వివేక్ ఒబెరాయ్ మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయని అంటున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే మాట వినిపిస్తోంది.