దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బిగ్ దివాలీ సేల్ పేరుతో నేటి (అక్టోబర్‌ 14) నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తున్న సేల్‌ లో ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లు తదితర గృహోపకరణాలతోపాటు, వస్త్రాలు షూస్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా ఈ సేల్‌లో మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. బై బ్యాక్ ఆఫర్‌తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా పది శాతం రాయితీ ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సెర్వ్ కార్డులపై నో కాస్ట్- ఈఎంఐ ఆఫర్‌ ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. రెడ్‌మీ నోట్ 4 అసలు ధర రూ.12,999 ఆఫర్‌ ధర రూ.10,999 మోటో సి ప్లస్‌ అసలు ధర రూ.6,999 ఆఫర్‌ ధర రూ.5,999..అలాగే శాంసంగ్ గెలాక్సీ ఆన్ మ్యాక్స్2 రూ.15,900 ధరలో రూ.1000 తగ్గింపుతోపాటు ఎక్స్‌చేంజ్‌ ద్వారా పై రూ.3 వేలు తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్7 రూ.29,990కి విక్రయిస్తుండగా ఎక్స్‌చేంజ్‌పై మరో రూ.3వేలు అదనంగా ఇస్తోంది. మోటో ఈ4ప్లస్ రూ.9,499కే అందుబాటులో ఉంది. దీనికి రూ.1000 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రోను రూ.5,999కే అందుబాటులో ఉంచింది.మరోవైపు గూగుల్ పిక్సెల్ (32 జీబి) రూ. 57,000 ఆఫర్‌ ధర రూ. 34,999 గూగుల్ పిక్సెఎ‌్స్ ఎల్‌ (32జీబీ) రూ. 67,000 కాగా ఆఫర్‌ ధరలో రూ. 39,999లకే భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది.అంతేకాదు, మోటో టర్బో, మోటో ఎక్స్‌(32జీబీ) ఆనర్ 5ఎక్స్ ‌ హువాయ్ పీ9, లీఎకో లె మాక్స్ 2, ఆల్కాటెల్ ఐడల్ 4 పై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది.