ఈశ్వర్‌ నుంచి ‘మిర్చి’ వరకు… టోటల్‌గా పదహారు సినిమాలు… ఒక్క సినిమాను కూడా శ్రద్ధా కపూర్‌ వదల్లేదు! ప్రభాస్‌ నటించిన తెలుగు సిన్మాలన్నీ చూశారట. ఎప్పుడో తెలుసా? ‘సాహో’కి సంతకం చేసిన తర్వాత. ‘సాహో’ షూటింగులో ఎంటరవ్వడానికి ముందే అన్నీ చూసేశారట! హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో ఒక్కో సినిమా గురించి శ్రద్ధా చెబుతుంటే… ప్రభాస్‌తో పాటు ‘సాహో’ టీమ్‌కి స్వీట్‌ షాక్‌ తగిలింది.ప్రభాస్‌ సిన్మాలన్నీ మీరెప్పుడు చూశారు? అనడిగితే… ‘‘ప్రభాస్‌ నటన గురించి పూర్తిగా తెలియాలంటే అతని సిన్మాలన్నీ చూడాలి కదా! నేనదే చేశా’’ అని శ్రద్ధా చెప్పారట! ఆమె కమిట్‌మెంట్‌కి అందరూ క్లాప్స్‌ కొట్టారట. అంతే కాదండోయ్‌…. ప్రభాస్‌కి ఓ కొత్త టైటిల్‌ కూడా ఇచ్చారీ బీ–టౌన్‌ బ్యూటీ. సాధారణంగా ప్రభాస్‌ని ‘డార్లింగ్, యంగ్‌ రెబల్‌స్టార్‌’ అని ఫ్యాన్స్‌ పిలుస్తుంటారు. శ్రద్ధా ఏమంటున్నారో తెలుసా? ‘ద న్యూ బ్లాక్‌బస్టర్‌ కింగ్‌’. ‘బాహుబలి’ ఎఫెక్ట్‌ అటువంటిది మరి.