మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనీ, ఈ సినిమాకి సంతోష శ్రీనివాస్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని నిన్నమెన్నటి వరకూ వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లడానికి ముందుగా పవన్ ఈ సినిమా చేయనున్నాడనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం సంతోశ్ శ్రీనివాస్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నాడని చెప్పుకున్నారు.

నిజంగానే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసుకున్న ఈ ‘కందిరీగ’ దర్శకుడు పవన్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా .. ఉండదా అనే సందేహం పవన్ అభిమానుల్లో ఉండేది. కానీ ఇప్పుడీ ప్రాజెక్టు లేనట్టేననే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తాను సినిమా చేసే అవకాశం లేదనీ, మరో ప్రాజెక్టుతో ముందుకు వెళ్లమని తాజాగా సంతోశ్ శ్రీనివాస్ కి పవన్ చెప్పినట్టుగా సమాచారం. దాంతో సంతోశ్ శ్రీనివాస్ మరో హీరోను వెతుక్కునే పనిలో పడ్డాడట.