తెలుగు తెరకి ‘మజ్ను’ సినిమా ద్వారా పరిచయమైన అనూ ఇమ్మాన్యుయెల్, గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. యూత్ లో ఇప్పుడామెకి మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పవన్ 25వ సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా యూనిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పటి సంగతిని గురించి తాజాగా ఆమె ప్రస్తావించింది. “పవన్ సినిమాలో చేయవలసి ఉంటుందని వాళ్లు చెప్పినప్పుడు, ఆయనకి చెల్లెలిగానేమోనని అనుకున్నాను. కానీ హీరోయిన్ పాత్ర కోసం అని వాళ్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను .. ఆనందంతో ఎగిరిగంతేశాను. ఇక ఈ సినిమా మొదటి రోజున షూటింగ్ కి కాస్త భయంగానే వెళ్లాను. కానీ అక్కడ పవన్ ని చూడగానే అన్నీ మరిచిపోయాను” అంటూ చెప్పుకొచ్చింది. “ఇక నుంచి తెలుగు సినిమాలకే నా ప్రాధాన్యత .. ఆ తరువాతనే తమిళ .. మలయాళ సినిమాలు” అనే విషయాన్ని స్పష్టం చేసింది.