ఢిల్లీ : సెల్ఫీ ట్రెండ్‌ వచ్చాక ముందు కెమెరాతో ఎన్నో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ మధ్య డ్యుయల్‌ కెమెరాలున్న ఫోన్లు కూడా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వీటికి వెనుకవైపు రెండు కెమెరాలతో పాటు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. తాజాగా నాలుగు కెమెరాలతో ఓ స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లోకి వచ్చింది. చైనాకు చెందిన హుయావి అనే సంస్థ.. హానర్‌ 9ఐ పేరుతో దేశీయ విపణిలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది.నాలుగు కెమెరాలతో పాటు ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే దీని ప్రత్యేకం. ఈ ఫోన్లో ముందు రెండు కెమెరాలు, వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. ప్రైమరీ కెమెరాతో ఫొటోలు తీస్తుండగా.. సెకండరీ కెమెరా ఫీల్డ్‌ ఎఫెక్ట్స్‌ను తీయడంలో ఉపయోగపడుతుంది. దీని ధర రూ.17,999గా నిర్ణయించింది. అక్టోబర్‌ 14 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
హానర్‌ 9ఐ ఫీచర్లు
* 5.9 అంగుళాల ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే
* ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* ముందువైపు 13 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్‌తో సెకండరీ కెమెరా
* వెనుకవైపు 16 మెగాపిక్సెల్‌తో ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్‌తో సెకండరీ కెమెరా
* 3340ఏంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం