న్యూ ఢిల్లీ: దోమలను తరమడానికి జెట్‌ కాయిల్స్‌ను, బాడ్మింటన్‌ రాకెట్స్‌ను ఉపయోగించి ఉంటాం. కానీ ఇప్పుడు దోమలకు తరిమేసే స్మార్ట్‌ఫోన్లు కూడా మార్కెట్‌లోకి వచ్చేశాయి. ప్రముఖ మొబైల్‌ హ్యాడ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ఎల్‌జీ తాజాగా ఇలాంటి ఫీచర్‌తో ‘కే7ఐ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,990. మస్కిటో అవే టెక్నాలజీతో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో 5 అంగుళాల డిస్‌ప్లే, 2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది.