రిలయన్స్ జియో 19 అక్టోబర్ నుంచి తన టారిఫ్ ప్లాన్స్ ను రివైజ్ చేస్తుంది . దీని కంటే ముందు కంపెనీ తన యూజర్స్ కోసం దీపావళి పండుగ సందర్భం గా ఒక స్పెషల్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది . జియో దీనిని “JIO ధనా ధన్ ఆఫర్ ” అని పిలుస్తుంది . ఈ ఆఫర్ లో ఒకవేళ యూజర్ 12 నుంచి 18 అక్టోబర్ మద్య Rs. 399 ల రీఛార్జ్ చేస్తే కనుక వారికి JIO 100% క్యాష్ బ్యాక్ ఇస్తుంది .ఈ రీఛార్జ్ ఒక అడ్వాన్స్ రీఛార్జ్ లా ఉంటుంది , అంటే మీ కొనసాగుతున్న ప్లాన్ ముగిసినప్పుడు ఈ ప్లాన్ అమలులోకి వస్తుందని అర్థం. ఈ 100% క్యాష్ బ్యాక్ 8 వోచర్స్ రూపంలో లభిస్తుంది , ఈ ప్రత్యేక వాచర్ యొక్క ధర Rs. 50 ఉంటుంది . యూజర్స్ ఈ వోచర్స్ ని Rs. 309 లేదా అంత కంటే ఎక్కువ రీఛార్జ్ , లేదా డేటాను యాడ్ చేయటానికి Rs. 91లేదా అంత కంటే ఎక్కువ రీఛార్జ్ కోసం ఉపయోగించవచ్చు.ఈ వోచర్స్ యొక్క లాభం 15 నవంబర్ తరువాత పొందవచ్చు .ఈ ఆఫర్ యొక్క లాభం మై జియో యాప్ , జియో . కామ్ , రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ , జియో స్టోర్స్ , పే టీఎం , అమెజాన్ పే , ఫోన్ పే అండ్ మొబి క్విక్ వంటి సర్వీసెస్ ద్వారా పొందవచ్చు .జియో తన JioPhone యొక్క షాపింగ్ కూడా స్టార్ట్ చేసింది . ఎయిర్టెల్ అయితే కార్బన్ తో పార్టనర్ షిప్ పెట్టుకుంది .