ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికి అందులోని ఆండ్రాయిడ్ యాప్స్, నియర్‌బై డివైస్‌లతో కమ్యూనికేట్ చేయగలిగేలా సరికొత్త డెవలపర్ టూల్‌ను గూగుల్ కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేసింది. ఈ నియర్‌బై కనెక్షన్స్ టెక్నాలజీని ప్రస్తుతం ఆండ్రాయిడ్ డెవలపర్స్ మాత్రమే పొందగలగుతున్నారు.ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. మీరు హోటల్ రూమ్‌కు వెళ్లినప్పుడు, మీ ఎంట్రీని పసిగట్టిన వెంటనే రూమ్‌లో ఉష్ణోగ్రత మీకు అనుగుణంగా సెట్ కాబడతుంది. ఇదే సమయంలో మీ నచ్చిన ఫేవరేట్ మ్యూజిక్ టర్న్ ఆన్ అవుతుంది. ఇలా మీకు అవసరమైన అనేక పనులు మీ ప్రమేయం లేకుండానే ఫోన్ ద్వారా జరిగిపోతుంటాయి.ప్రస్తుతానికి ఆరంభ దశలో ఉన్న ఈ టెక్నాలజీని భవిష్యత్‌లో లాంచ్ కాబోయే అన్ని యాప్స్ దాదాపుగా వినియోగించుకోనున్నాయి. గూగుల్ తన Nearby Connections API టెక్నాలజీని 2015లో అనౌన్స్ చేసింది. ఈ టెక్నాలజీ ఆధారంగానే మొబైల్ డివైస్‌లను, టీవీలో రన్ అయ్యే గేమ్‌లకు సెకండ్ స్ర్కీన్ కంట్రోలర్స్‌గా గూగుల్ మార్చగలిగింది. అప్‌డేటెడ్ ఫ్రేమ్‌వర్క్‌తో లాంచ్ అయిన గూగుల్ నియర్ బై కనెక్షన్స్ టూల్‌కిట్ Wi-Fi, Bluetooth కనెక్టువిటీ ఆధారంగా నియర్ బై డివైస్‌లకు కనెక్ట్ అవుతుంది.గూగుల్ Nearby Connections API టెక్నాలజీని వినియోగించుకుంటోన్న యాప్‌లలో The Weather Channel యాప్ ఒకటి. ఈ యాప్ అత్యవసర వాతావరణ హెచ్చరికలను జారీ చేసే క్రమంలో నియర్ బై కనెక్షన్ ఏపీఐని ఉపయోగించుకుని ఆన్-డిమాండ్ మెష్ నెట్‌వర్క్‌లను క్రియేట్ చేస్తుంది. మరో యాప్ Hotstar కూడా ఆఫ్‌లైన్ మీడియా షేరింగ్ నిమిత్తం ఈ టెక్నాలజీని వినియోగించుకంటోంది. మరొక యాప్ GameInsight కూడా ఆఫ్‌లైన్ గేమింగ్ నిమిత్తం ఈ టెక్నాలజీని వినియోగించుకుంటోంది.తాజాగా Android TV కూడా సరికొత్త రిమోట్ కంట్రోల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నియర్ బై కనెక్షన్స్ టెక్నాలజీ ఆధారంగా స్పందించే ఈ యాప్ ఎండ్ యూజర్లకు ఇనీషియల్ సెటప్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేయటంతో పాటు సెకండ్ స్ర్కీన్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.గూగుల్ Nearby Connections APIను ఆండ్రాయిడ్ డెవలపర్లు developers.google.comలోకి వెళ్లి Google Play services 11.0 ద్వారా పొందాల్సి ఉంటుంది. ఆండ్రాయడ్ జెల్లీబీన్ ఆపై వర్షన్ పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో ఈ డెవలపర్ ప్రివ్యూ వర్క్ అవుతుంది.