ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు. తన చిత్రాల షూటింగ్ పూర్తయిన తరువాత హిమాలయాలకు వెళ్లి, ఓ వారం పదిరోజులు గడిపి వచ్చే ఆయన, ‘కాలా’, ‘2.0’ చిత్రాల షూటింగ్ పూర్తి కావడంతో తనకు ఇష్టమైన ప్రాంతాన్ని వెతుక్కుంటూ సామాన్యునిలా బయలుదేరి వెళ్లారు. సూపర్ స్టార్ గా ఆయనకు ఎంత స్టార్ డమ్ ఉన్నా, హిమాలయాలకు ఆయన సాధారణ వ్యక్తిగా వెళతారన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ప్రవేశించే ముందు కొంతకాలం ధ్యానంలో గడపాలని ఆయన భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నారని రజనీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.