యూర‌ప్, ఆసియా, ద‌క్షిణ అమెరికాలోని ప‌లు దేశాల్లో వాట్సాప్ యాప్ కొద్దిసేపు మొరాయించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దేశాల వినియోగ‌దారులు సోష‌ల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల వెల్లువ‌కు వాట్సాప్ నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. ట్విట్ట‌ర్‌లో వాట్సాప్‌డౌన్ పేరుతో వినియోగ‌దారులు ఫిర్యాదులు చేశారు. దుర‌దృష్ట‌క‌ర విష‌యం ఏంటంటే… వాట్సాప్‌కి అధికారికంగా ట్విట్ట‌ర్ అకౌంట్ ఉన్నా, కంపెనీ దాన్ని పెద్ద‌గా ఉప‌యోగించ‌దు. త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్ 2016లో అప్‌డేట్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ అకౌంట్‌లో ఎలాంటి యాక్టివిటీ లేదు. అయిన‌ప్ప‌టికీ వాట్సాప్‌లో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వినియోగ‌దారులు ట్విట్ట‌ర్‌ని ఆశ్ర‌యిస్తారు. మొరాయించిన వాట్సాప్ ప్ర‌స్తుతం తిరిగి ప‌నిచేస్తోందని కొన్ని దేశాల వినియోగ‌దారులు చెబుతున్నారు.