తిరువనంతపురం: కేరళ కొల్లంలోని చవారాప్రాంతంలో ఉన్న వంతెన ఒకటి సోమవారం ఉదయం కూలిపోయింది. స్థానికులు వంతెన దాటుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ వంతెన చాలా ఏళ్ల క్రితం కట్టిందని స్థానికులు వెల్లడించారు. కేవలం నది దాటడానికి ఇనుము, చెక్క కర్రలతో దీనిని కట్టించినట్లు పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.