మధ్యాహ్నం భోజనం సమయంలో ఓ విద్యార్థి పప్పు కూర కాస్త ఎక్కువ వేయమని అడగడమే పాపమైంది. ఆహారం వడిస్తున్న మధ్యాహ్న భోజన సిబ్బంది.. విద్యార్థి ముఖంపై వేడి వేడి పప్పు కూర చల్లేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ దిందోరిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. వేడి వేడి కూర విద్యార్థి ముఖంపై చల్లడంతో.. అతడి ముఖం, ఛాతీ భాగం కాలిపోయింది. హుటాహుటిన బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.