ఉబెర్‌ కస్టమర్లకు తీపి కబురు తెలిపింది ఉబెర్‌ సంస్థ..కాకపోతే ఇది మన దగ్గర కాదు దుబాయ్‌లోని తన వినియోగదారుల సూపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికి వరకు సెడాన్లు, సౌకర్యవంతమైన కార్లు మాత్రమే దుబాయ్‌ రోడ్లపై పరుగులు పెట్టేవి. ఇక నుండి ప్రపంచంలో మొదటిసారిగా విద్యుత్తుతో నడిచే 50 టెస్లా కార్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఈ కార్లు దుబాయ్ రోడ్ల పై చక్కర్లు కొట్టబోతాయి అన్నమాట.దుబాయ్‌ టాక్సీ కార్పొరేషన్‌ సహకారంతో మంగళవారం ఉబెర్‌ వన్‌ ను ప్రారంభించింది. మోడల్‌ ఎక్స్‌, మోడల్‌ ఎస్‌ 50 కార్లను దీనికి అనుసంధానించనుంది. కాకపోతే వీటిలో తిరగాలంటే వినియోగదారులు ఎక్కువ ఛార్జీని చెల్లించాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో దుబాయ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ 2018-19 నాటికి 150 టెస్లా కార్లను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.