కేవలం రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజుల పాటు 1 గిగాబైట్ డేటా అంటూ సంచలన టారిఫ్ ప్లాన్ ను వెల్లడించి, ఇతర టెలికం సంస్థలను ఆలోచనలో పడేసిన రిలయన్స్ జియో, ఇప్పుడు మరో శుభవార్తను వినిపించింది. తొలుత కేవలం జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ టారిఫ్ ప్లాన్ వర్తిస్తుందని చెప్పి, కస్టమర్లను కొంత నిరాశకు గురి చేసిన సంస్థ, ఇప్పుడు జియో సిమ్ వాడే ప్రతి ఒక్కరూ ఈ ప్లాన్ వాడుకోవచ్చని వెల్లడించింది. కాగా, 28 రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటాను మరే ఇతర టెలికం సంస్థ కూడా ఆఫర్ చేయడం లేదన్న విషయం తెలిసిందే.