మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక కాలనీలో చిరుతపులి ప్రవేశించి హల్ చల్ చేసింది. ఇండోర్‌ లోని పలహార్‌ నగర్‌ లో నిర్మాణంలో ఉన్న భవంతిలోకి చిరుతపులి ప్రవేశించింది. దానిని గుర్తించిన కాలనీ వాసులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. కాలనీకి వచ్చిన అటవీ సిబ్బంది, కాలనీ వాసుల సాయంతో దానిని సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అది ఒక భవంతి నుంచి మరో భవంతిపైకి దూకుతూ, కాలనీలోని రోడ్లపై పరుగులు తీస్తూ ముగ్గుర్ని గాయపరిచింది. దీంతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోయారు. ఎట్టకేలకు అటవీ సిబ్బంది మత్తు ఇంజెక్షన్ సాయంతో దానిని పట్టుకుని జూకి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.