దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఫోన్ల గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు నోకియా, శాంసంగ్ గట్టి పోటీ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ లో సెల్ ఫోన్ రేట్లు భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాంసంగ్ తన ప్రైమ్ ఫోన్లపై భారీ తగ్గింపును అందజేస్తోంది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ జే7 ప్రైమ్‌, గెలాక్సీ జే5 ప్రైమ్‌ల ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్‌ ప్రకటించింది. గత నెలలోనే ఈ ఫోన్లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ కూడా వచ్చింది.శాంసంగ్ కంపెనీ తగ్గించిన ధరల ప్రకారం శాంసంగ్‌ గెలాక్సీ జే7 ప్రైమ్‌ ఇప్పుడు రూ.14,900కు లభిస్తోంది. దీని ఒరిజినల్ ధర రూ.18,790.గెలాక్సీ జే7 ప్రైమ్ ఫీచర్లు 5.50 అంగుళాల డిస్‌ప్లే 1.6 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.గెలాక్సీ జే5 ప్రైమ్ ఫీచర్లు 5.00 అంగుళాల డిస్‌ప్లే 1.4గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్