అమెరికాకు చెందిన ప్రముఖ డేటా స్టోరేజ్ కంపెనీ వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం సరికొత్త మొబైల్ మెమురీ సొల్యూషన్‌తో ముందుకొచ్చింది. SanDisk Dual Drive పేరుతో ఓ స్టోరేజ్ డివైస్‌ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ పెన్‌డ్రైవ్‌ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టెంట్‌గా స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేసుకునేందుకు ఈ పెన్‌డ్రైవ్ తోడ్పడుతుంది.ఈ పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్ అయ్యే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా యూఎస్బీ ఆన్ ద గో సపోర్ట్‌ను కలిగి ఉండాలి. ఈ స్టర్డీ పెన్‌డ్రైవ్‌లో మొత్తం రెండు రకాల యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి యూఎస్బీ పోర్ట్ కాగా మరొకటి మైక్రో-యూఎస్బీ పోర్ట్. ఈ రెండు కనెక్టువిటీ పోర్టుల ద్వారా రకరకాల డివైస్‌లకు పెన్‌డ్రైవ్‌ను కనెక్ట్ చేసుకునే వీలుంటుంది.దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈజీ డేటా ట్రాన్స్‌ఫర్ సొల్యూషన్స్‌కు మరింత డిమాండ్ ఏర్పడిందని లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న వెస్ట్రన్ డిజిటల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా విభాగం) ఖలీద్ వాణి తెలిపారు. ఈ పెన్‌డ్రైవ్‌తో పెయిర్ చేసిన SanDisk Memory Zone యాప్ ద్వారా యూజర్లు తమ స్టోరేజ్ సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.SanDisk Dual Drive మొత్తం నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు.. 16జీబి (ధర రూ.700), 32జీబి (ధర రూ.1,150), 64జీబి (ధర రూ.2,000), 128జీబి ధర రూ.3,500. అన్ని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లతో పాటు రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు అందుబాటులో ఉంటాయి.ఈ నాలుగు పెన్‌డ్రైవ్‌లు ఆటోమెటిక్ గ్యాలరీ బ్యాకప్ కోసం SanDisk Memory Zone యాప్‌ను ఉపయోగించుకుంటాయి. SanDisk పెన్‌డ్రైవ్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ యాప్‌లో టైమ్‌లైన్ బేసిడ్ ఫోటో బ్రౌజర్, ఇంటిగ్రేటెడ్ వీడియో అండ్ మ్యూజిక్ ప్లేయర్, బిల్ట్‌ఇన్ ఫైల్ కంప్రెషన్ అండ్ డికంప్రెషన్, అగ్రిగేటెడ్ వ్యూ ఆఫ్ ఆల్ కంటెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి అని సమాచారం