దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్ మ‌రోసారి గ్రేట్ ఇండియ‌న్ సేల్‌ని తీసుకురానుంది. అక్టోబ‌ర్ 14 నుంచి 17 వ‌ర‌కు మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ సేల్‌లో అందుబాటులోకి తీసుకురానున్న ఆఫ‌ర్ల వివరాల‌ను త‌మ వెబ్‌సైట్‌లో పెట్టింది. మొబైల్ ఫోన్ల మీద 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌, ల్యాప్‌టాప్‌ల మీద రూ. 20,000 వ‌ర‌కు త‌గ్గింపు, హెడ్‌ఫోన్లు, స్పీక‌ర్ల‌పై 60 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌, మొబైల్ యాక్స‌స‌రీస్ మీద 80 శాతం వ‌ర‌కు త‌గ్గింపు వంటి మ‌రెన్నో ఆఫ‌ర్ల‌ను అందుబాటులో ఉంచ‌నుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌పై ప‌ది శాతం క్యాష్ బ్యాక్‌, అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లిస్తే రూ. 500 క్యాష్ బ్యాక్ వంటి స‌దుపాయాలు కూడా క‌ల్పించ‌నున్న‌ట్లు అమెజాన్ పేర్కొంది. దాదాపు 30,000ల‌కు పైగా ఉత్ప‌త్తుల‌పై ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు అమెజాన్ తెలిపింది.ఈ ఆఫ‌ర్ల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక స‌బ్‌స్క్రైబింగ్ మొబైల్స్ కొంటే డేటా, వాయిస్‌కాల్ ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు వ‌న్ ప్ల‌స్ 5, నోకియా 6, కూల్‌ప్యాడ్ కూల్ 1 కొనుగోలు చేసిన వారికి వొడాఫోన్ 75జీబీ 4జీ డేటా అంద‌జేయ‌నుంది. అలాగే నూబియా ఎం2 లైట్‌, ఆన‌ర్ 6ఎక్స్‌, నూబియా జెడ్‌11 కొన్న‌వారికి 64 జీబీ డేటాను ఐడియా అంద‌జేస్తుంది. అలాగే అమెజాన్ యాప్ వినియోగ‌దారుల‌కు కూడా ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. సేల్ జ‌రుగుతున్న‌పుడు గోల్డెన్ అవ‌ర్స్ పేరుతో రాత్రి 8 గం.ల నుంచి 12 గం.ల వ‌ర‌కు యాప్ వినియోగ‌దారుల‌కు ప్ర‌త్యేక డిస్కౌంట్లు ఇవ్వ‌నుంది.